Utsav Information

విజయనగరం ఉత్సవాలు

  • ప్రజలందరి భాగస్వామ్యంతో ఉత్సవాలు విజయవంతం చేయాలి.
  • సంప్రదాయాలను పాటిస్తూ అమ్మవారి పండుగ నిర్వహించాలి
  • ఉత్సవాల నిర్వహణపై సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ
  • ఉత్సవాల్లో ప్లెక్శీలు, బ్యానర్లుకు అనుమంతిచొద్దు: మునిసిపల్ అధికారులకు మంత్రి ఆదేశాలు
  • జిల్లా ప్రతిష్ట ఇనుమండిచేలా ఉత్సవాలు: ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

జిల్లా, నగర ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ విజయనగర ఉత్సవాలు విజయవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాబివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా అధికారులు, వివిధ కమిటీల సభ్యులకు పిలుపునిచ్చారు.

ఈ ఉత్సవాలు ప్రజలందరికీ చెందుతాయని, అందరినీ భాగస్వాములను చేస్తూ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ వేడుకల నిర్వహణలో సంప్రదాయాలకు భంగం కలగని రీతిలో వ్యవహరించాలని సృష్టంచేశారు. సిరిమానోత్సవానికి బందోబస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేస్తూనే అధికంగా భక్తులు ఈ ఉత్సవాన్ని తిలకిచేందుకు వీలుగా భక్తుల పట్ల కొంత సరళంగా వ్యవహరించాలన్నారు.

విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ ఏర్పాట్లపై ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి శ్రీమతి పుష్ప శ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణలు సమీక్షంచారు. ఈ సందర్బంగా మంత్రి బొత్స మాట్లాడుతూ ఉత్సవాలకు వచ్చే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనం జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉత్సవాల సందర్బంగా ఏ చిన్న సంఘటనకు తావులేకుండా జాగ్రత్త వహించాలన్నారు.

అక్టోబర్ 12 నుండి 14 వరుకు మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలు విజయనగర సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించాలన్నారు.

ఐదు వేదికల్లో ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, జిల్లాకు చెందిన విశిష్ట వ్యక్తులకు సత్కరించే కార్యక్రమం కుడా వుందన్నారు. ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ జిల్లా ప్రతిష్ట ఇనుమండిచేలా ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు.

జిల్లాకు సాంస్కతిక పరంగా ఎంతో విసిస్టత వుందని, దానిని చాటిచెప్పేల కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్లెక్శీలు, బ్యానర్లుకు అనుమతి ఇవ్వొద్దు విజయనగర ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్బంగా ప్లెక్శీలు, బ్యానర్లు ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇవ్వద్దుని మంత్రి బొత్స సత్యనారాయణ పురపాలక అధికారులను ఆదేశించారు. మునిసిపాలిటీ అడ్డ్వేర్తిస్జింగ్ ఏజెన్సీలకు అనుమంతించిన హోర్డింగులు మినహా ఏ ఒక్కటీ అదనంగా కనిపించడానికి వీలేదన్నారు.

శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ గతంలో నిర్వహించిన ఉత్సవాల అనుభవాలను దృష్టిలో వుంచుకొని గతం కంటే మిన్నగా ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహించాలన్నారు. సుదూర ప్రాంతాల నుండి అమ్మవారి దర్సనం కోసం వచ్చే భక్తులకు అసౌకర్యం కలగని రీతిలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. అత్యదికంగా భక్తులు సిరిమానోత్సవం తిలకించేలా అవకాశం కల్పించాలన్నారు. సిరిమానోత్సవం రోజున నగరంలో పారిశుధ్యంపై ప్రత్యక శ్రద్ద వహించాలని మునిసిపల్ అధికారులకు సూచించారు. సామాన్య భక్తుల దర్సనానికే అధిక ప్రాదాన్యత ఇవ్వలన్నారు.

ఉత్సవ ఊరేగింపు అమ్మవారి కోవెల నుంచి ఉత్సవ ఆరంభ సూచికగా మొదలవుతుంది.

ప్రారంభోత్సవ కార్యక్రమం ఆనందగజపతి ఆడిటోరియంలో ప్రముఖుల సన్మానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, కళారూప ప్రదర్శనలు మరెన్నో నిర్వహించ తలపెట్టారు.

గతంలో నిర్వహించిన తరహాలోనే ఈ ఏడాది పుష్ప ప్రదర్శనను సంగీత కళాశాలలో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. గురజాడ కళాభారతి నందు నాటికలు, ఏక పాత్రాభినయం మొదలగునవి. పులివేషాల పోటీలు, లఘు చిత్ర పోటీలు, జానపదాలు ప్రదర్శన పోటీలు.

13,14 తేదిల్లో సాయంత్రం వేళల్లో అయోధ్య మైదానంలో కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.

15న పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం పూర్తయిన తర్వాత బాణసంచా కాల్చే ఏర్పాట్లు చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఇందుకు అనువైన ప్రదేశాన్ని పోలీసు అధికారులే గుర్తించాలని పేర్కొన్నారు .

Collector